డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకోరని, దానికి కొనసాగించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని...
నాంపల్లి, అక్టోబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకోరని, దానికి కొనసాగించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పెద్దాపురం చెరువు, నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు రద్దు చేయాలని చూస్తుందని, ఈ ప్రాజెక్టు రద్దు అయితే మునుగోడులో నిర్మిస్తున్న కిష్ట రామ్ పెళ్లి , చర్లగూడెం ప్రాజెక్టులకు నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు లేక కేవలం బోర్ల నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను చూసి అయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రద్దు ఆలోచనను మానుకోవాలన్నారు.
అదేవిధంగా చర్లగూడెం కృష్ణరాయన్ పెళ్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శేషలేటి వాగు నుండి గొలుసు కాల్వల ద్వారా చెరువులోకి నీళ్లను నింపితే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులలో పూడిక తీయడంతో చెరువులు నీళ్లతో నిండి కళకళలాడుతూ ఉండేవన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులలో నీరు నిల్వ లేకపోవడం బాధాకరమన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సోషల్ మీడియాపై ఉన్న శ్రద్ధ మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. ఆయనకు ఎప్పుడు మంత్రి పదవి, కాంట్రాక్టుల బిల్లుల కోసమే ఆరాటం తప్ప, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం ఆయన చేసిన పని శూన్యం అన్నారు. ఇప్పటికైనా ప్రచారంపై శ్రద్ధ మానుకుని మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని నాంపల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు… కూసుకుంట్ల ఆగ్రహం
నాంపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రిని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో వైద్యులు ఎవరూ లేకపోవడంతో కేవలం నర్సు మాత్రమే రోగులకు వైద్యం చేస్తుండడంతో డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడి వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు ఇతర సిబ్బంది డ్యూటీకి రాకపోయినా రిజిస్టర్లో వచ్చినట్టుగా సంతకాలు పెట్టి పోతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ని వేరే దగ్గరికి డిప్యూటేషన్‌పై పంపించడం ఏంటని ఆయన ప్రశ్నించాడరు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మాడపు నరసింహారావు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోగుల వెంకట్ రెడ్డి, సర్పంచులు నక్క చంద్రశేఖర్, కడారి శ్రీశైలం యాదవ్, పల్లె వెంకన్న, సాగర్ల యాదయ్య, దామెర సహదేవ్, పూదరి సైదులు, సభావత్ సర్దార్ నాయక్, కుంభం చరణ్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

