న్యూశాయంపేట, సెప్టెంబర్ 24 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రేటర్ పరిధి 49వ డివిజన్లోని ఇందిరమ్మకాలనీ ఇంకా నీటిలోనే ఉంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బంధం చెరువు మత్తడికి గుర్తుతెలియని దుండగులు గండి కొట్టడంతో జలమయమైంది.
పారిశుధ్య సిబ్బంది బురద, చెత్తను తొలగించకపోవడంతో బస్తీలన్నీ దుర్గంధంగా మారాయి. కాలనీలో రెండు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని, ఇదేనా.. ప్రజాప్రభుత్వం తీరని కాలనీవాసులు మండిపడుతున్నారు.