కొత్తగూడెం అర్బన్, మే 14 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్‌ను కలిసి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీలకు సంబంధం లేకుండా, మాజీ కౌన్సిలర్లు, అధికార పార్టీ నాయకులకు సంబంధించిన అర్హులు కాని వారికి ఇండ్లు మంజూరు చేశారన్నారు. ఎంపిక విషయాలలో భారీగా అవకతవకలు జరిగాయాన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, పట్టణ నాయకులు గూడ విజయ, గుంపుల మహేశ్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.