రికార్డుస్థాయికి ఫారెక్స్ రిజర్వులు
దేశీయ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.422 బిలియన్ డాలర్లు ఎగబాకి 729.328 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లిడించింది. మారకం విల్వలు ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం దేశీయ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 9.905 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.
- 729 బిలియన్ డాలర్లకు..
ముంబై, ఆగస్టు 28: దేశీయ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.422 బిలియన్ డాలర్లు ఎగబాకి 729.328 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లిడించింది. మారకం విల్వలు ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం దేశీయ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 9.905 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతానికి నమోదైన 728.494 బిలియన్ డాలర్లు ఇదే గరిష్ఠ స్థాయి. మళ్లీ ఇప్పుడు ఆరు నెలల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరాయని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం కావడంతో రిజర్వుబ్యాంక్ జోక్యం చేసుకోని డాలర్ల విక్రయించడంతో అడ్డుకట్ట పడింది.
గత వారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 9.482 బిలియన్ డాలర్లు ఎగబాకి 591.333 బిలియన్ డాలర్లకు చేరుకోవడం వల్లనే రిజర్వులు రికార్డు స్థాయికి ఎగబాకాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. విదేశీ మారకపు నిల్వల్లో యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికేతర కరెన్సీల విలువ పెరుగడం లేదా తగ్గడం వల్ల కలిగే ప్రభావాలు కూడా విదేశీ నిల్వలపై ప్రభావం చూపనున్నాయి. అలాగే బంగారం రిజర్వులు 2.801 బిలియన్ డాలర్లు ఎగబాకి 114.218 బిలియన్ డాలర్లకు చేరుకోగా..స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 112 మిలియన్ డాలర్లు అధికమై 18.852 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత రిజర్వులు 26 మిలియన్ డాలర్లు అధికమై 4.925 బిలియన్ డాలర్లకు చేరాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

