17కోట్లకుపైగా టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
17కోట్లకుపైగా టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ | కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా డోసులు వేసినట్లు పేర్కొంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు 95,46,871 మందికి మొదటి డోసు, మరో 64,71,090 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. 1,39,71,341 ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు మొదటి డోసు, 77,54,283 రెండో మోతాదు వేసినట్లు తెలిపింది.
18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 20,29,395 ఫస్ట్ డోస్ వేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న 5,51,74,561 మంది లబ్ధిదారులకు తొలి, మరో 65,55,714 మందికి సెకండ్ డోస్ అందజేసినట్లు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన 5,36,72,259 మందికి తొలి మోతాదు, 1,49,77,918 రెండో మోతాదు టీకా వేసినట్లు వివరించింది. 18-44 మధ్య వయస్కులకు ఆదివారం ఒకే రోజు 2,43,958 మంది లబ్ధిదారులు టీకాలు వేయగా.. ఇప్పటి వరకు 20,29,395 మంది తొలి మోతాదు అందింది.
టీకా డ్రైవ్ ఆదివారం 114వ రోజుకు చేరగా.. ఒకే రోజు 6,71,646 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆదివారం సెలవు దినం కావడంతో చాలా రాష్ట్రాలు టీకాలు వేయలేదని చెప్పింది. ఇదిలా ఉండగా.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో 9 లక్షల డోసులు అందజేస్తామని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

