అబుదాబి: ఇరాన్ క్షిపణి దాడుల్ని అడ్డుకుంటున్నా.. వాటి శకలాలు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన గురువారం అబుదాబిలో చోటుచేసుకుంది. ఇరాన్ మిస్సైల్‌ను అబుదాబీ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ, వీటి శకలాలు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు భారతీయుడు, మరొకరు పాకిస్థానీ ఉన్నాడని అక్కడి అధికారులు ధృవీకరించారు. స్వీహాన్ వీధిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ‘ఎక్స్’లో తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులు గురువారంతో 27వ రోజుకు చేరుకున్నాయి.