UK Museum | బ్రిటన్ మ్యూజియంలో (UK Museum) భారీ దొంగతనం జరిగింది. 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు (High Value Items Stolen). వీటిలో భారత్‌కు చెందిన విలువైన కళాఖండాలు (Indian Artefacts) కూడా ఉన్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూకే మీడియా నివేదికల ప్రకారం.. బ్రిస్టల్ (Bristol)లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగింది. మ్యూజియంలోని 600కిపైగా అత్యంత విలువైన వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. వీటిలో భారత్‌కు చెందిన విలువైన కళాఖండాలు ఉన్నాయి. అవి ప్రత్యేక గుర్తింపు పొందిన బ్రిటిష్ కాలం నాటి కళాఖండాలుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృష్యాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నలుగురు అనుమానితులు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు.
Also Read..
US Embassy | డెలివరీ కోసమా.. అయితే వీసాలివ్వం : యూఎస్ ఎంబసీ
ChatGPT: చాట్‌జీపీటీ వల్లే మర్డర్-సూసైడ్.. మైక్రోసాఫ్ట్ కంపెనీపై పరిహారం కేసు
Shivraj Patil | కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత