Samantha- Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. కొన్నాళ్లుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్లో ఉన్న సమంత డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అతనిని వివాహం చేసుకుంది . ఈ శుభకార్యానికి చాలా సన్నిహితులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వారు నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహం తరువాత సమంత తన ప్రొఫెషనల్ జీవితం లో బిజీగా ఉంది.. ‘శుభం’ సినిమా ద్వారా నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తూ, తానే నిర్మాతగా వ్యవహరిస్తోంది. మరోవైపు రాజ్ నిడిమోరు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లతో తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్న రాజ్, ఇప్పుడు మరో ఆసక్తికర ట్యాలెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. అదేంటంటే , రాజ్ నిడిమోరు కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా, ప్రొఫెషనల్ స్థాయిలో గాయకుడు కూడా. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కాగా, అందులో రాజ్ చాలా సింపుల్‌గా నేలపై కూర్చుని, మహా గణపతి సాంగ్ ను ఆలపిస్తుండగా, కుటుంబ సభ్యులు శ్రద్ధగా వింటున్నారు. ఫ్యామిలీ సమక్షంలో ఆలపించిన ఈ పాటకు నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. “రాజ్‌లో ఇంత ట్యాలెంట్ కూడా ఉందా?” అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చూస్తుంటే రాజ్ తన పాటలతోనే సమంతని పడేసి ఉంటాడని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విజయవంతం కావడం తో రాజ్ ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం సీజన్ 4ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సమంత–రాజ్ జంట, వివాహం తర్వాత తమ ప్రొఫెషనల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉండడమే కాకుండా, సోషల్ మీడియాలో పలు వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.