సిడ్నీ: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ స్కైడైవర్(Australia Skydiver).. విమానం తోక భాగంలో వేలాడాడు. కెయిన్స్ ప్రాంతంలో స్కైడైవింగ్ స్టంట్ కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. విమానం నుంచి డైవింగ్ కోసం బయటకు వచ్చిన సమయంలో.. ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగాన్ని చుట్టేసింది. దీంతో అతను దానికి వేలాడాడు. సుమారు 15 వేల ఫీట్ల ఎత్తులో ఈ ఘటన జరిగింది. పారాచూట్ కెమెరా ఆపరేటర్ ఈ ఘటనను ఫిల్మ్ తీశాడు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా రిలీజ్ చేశారు.
15 వేల ఫీట్ల ఎత్తులో 16 మంది స్కైడైవర్లు పారాచూట్‌తో స్టంట్ క్రియేట్ చేయాలని భావించారు. కానీ కొన్ని సెకన్లలో ఆ ప్లాన్ వికటించింది. అయితే ఓ స్కైడైవర్ పారాచూట్.. విమానం వింగ్‌కు చిక్కుకుపోవడంతో అతను రిజర్వ్ పారాచూట్‌ను యాక్టివేట్ చేశాడు. ఆరెంజ్ రంగు పారాచూట్ విమానం తోక భాగాన్ని అల్లుకుపోయింది. రిజర్వ్ చూట్కు చెందిన స్ట్రింగ్స్ను హుక్ నైఫ్‌తో కట్ చేశాడు. ఆ తర్వాత అతను మెయిన్ పారాచూట్‌ను ఓపెన్ చేశాడు.