వాషింగ్టన్, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇండియన్-అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇండియన్-అమెరికన్ల సంఖ్య రెండుకు చేరింది.
తాను కూడా పోటీ చేస్తానని నిక్కీ హేలీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో రామస్వామి మాట్లాడుతూ చైనాపై ఆధారపడటానికి ముగింపు పలుకుతానని, అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. ‘అమెరికా ఫస్ట్’ అన్నదే తన నినాదమని పేర్కొన్నారు.