Alexander Stubb : ఫిన్లాండ్ అధ్యక్షుడు (Finland President) అలెగ్జాండర్ స్టబ్ (Alexander Stubb) భారత దేశం (India) పై ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA), చైనా (China) దేశాలతోపాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్ (Super power) గా భారత్ నిలవనుందన్నారు. ప్రపంచశక్తిగా ఎదుగుతున్న భారత్కు ఐక్యరాజ్యసమితి (UNO) భద్రతా మండలి (UNSC) లో శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు.
ఒక ఇంటర్వ్యూలో అలెగ్జాండర్ స్టబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను భారత్కు గొప్ప అభిమానిని అని చెప్పారు. విదేశీ వ్యవహారాల్లో భారత్ అనుసరిస్తున్న విధానాలు సరైనవని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి లాంటి వేదికపై భారత్ లాంటి దేశాల పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు. యూఎన్ భద్రతామండలిని విస్తరించాలని జనరల్ అసెంబ్లీలో చెప్పారు. భారత్ లాంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం కరెక్ట్ కాదన్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లాటిన్ అమెరికా నుంచి ఒకరు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, ఆసియా నుంచి ఇద్దరు సభ్యులు ఉండాలని స్టబ్ సూచించారు. భారత్కు భద్రతా మండలిలో స్థానం లేకపోతే ఆ ఐరాస మరింత బలహీనపడుతుందని అన్నారు.