Global Peace Prayer: భూటాన్‌లో ప్రపంచ శాంతి ప్రార్థనలు ప్రారంభం.. వేల సంఖ్యలో హాజరైన బౌద్ధభిక్షువులు
Global Peace Prayer: భూటాన్‌లో ప్రపంచ శాంతి ప్రార్థనలు ప్రారంభం అయ్యాయి. 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ గురువులు, నేతలు, బిక్షువులు, శాంతి దూతలు భారీ సంఖ్యలో ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటున్నారు.
థింపు: భూటాన్‌లో ప్రపంచ శాంతి ప్రార్థనలు(Global Peace Prayer) ప్రారంభం అయ్యాయి. నవంబర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేతలు, బిక్షువులు, శాంతి దూతలు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజధాని థింపూలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. బజగురు, కాలచక్ర ప్రార్థనలు నిర్వహించనున్నారు.
బౌద్ధమతంలో ఉన్న భిన్నమైన సంప్రదాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థనల ద్వారా ఐక్యత చాటనున్నారు. భూటాన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 13 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ప్రఖ్యాత లామాలు, స్కాలర్స్, బౌద్ధ మతంలోని తీరవాడ, మహాయాణ, వజ్రాయన పద్ధతులను పాటించేవారు ఈ ప్రార్థనలకు హాజరవుతున్నారు. శాంతియుత, సంతోషకరమైన భవిష్యత్తు కోసం కావాల్సిన ప్రేమ, కరుణ గురించి అవగాహన క్రియేట్ చేయనున్నారు.
పవిత్రమైన జాబ్జీ దోహిచోగ్ క్రియతో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. చాలా అరుదైన ఈ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. శరీరాన్ని, వాక్కును, నెగటివ్ మైండ్‌ను శుద్ధి చేసే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ బౌద్ధ సంప్రదాయాలకు చెందిన గురువులు ఇంగ్లీష్, టిబెట్, దోంగ్కా భాషలు ప్రార్థనలు చేపట్టనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

