లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించేందుకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని, మహిళలకు హక్కులు కల్పించాలని, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధాని త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే బాలికల గౌరవం ఇస్తామని కానీ దేశం మాత్రం ఇస్లామిక్ చట్టమైన షరియత్ ప్రకారం నడవదని, రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ ముందుకు వెళ్తుందని యూపీ సీఎం యోగి అన్నారు.
#WATCH | PM has scrapped triple talaq to free that daughter, to give her rights&respect she's entitled to. To ensure respect to that daughter we say system won't be run as per Shariat but Constitution: UP CM on AIMIM chief Owaisi's 'hijab-clad woman will become PM one day' remark pic.twitter.com/zpF6bqtH1x
— ANI (@ANI) February 14, 2022