తెలుగు సినీరంగంలో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ బ్యానర్‌ను స్థాపించామని నిర్మాత కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతిభ ఉన్న వారికి మా సంస్థ సరైన వేదికగా నిలుస్తుంది.
వినూత్న కథలతో, సమకాలీన అంశాలతో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రాల్ని నిర్మించడమే మా లక్ష్యం. స్వేచ్ఛ, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ ప్రయోగాత్మక కథలకు పెద్దపీట వేస్తాం. ప్రస్తుతం కొన్ని కథలను ఫైనల్ చేసే పనిలో ఉన్నాం. తొలి సినిమా వివరాలను సంక్రాంతి సందర్భంగా ప్రకటిస్తాం’ అని అన్నారు.