మోకీ (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత అమ్మాయిల జట్టు జోరు కొనసాగుతోంది. మంగళవారం తమ మూడో మ్యాచ్‌లో భారత్.. 7-0తో జపాన్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. అమ్మాయిలతో పాటు పురుషుల జట్టూ అదరగొడుతున్నది. పూల్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్.. 7-3తో సౌత్ కొరియాను ఓడించింది. బుధవారం చైనీస్ తైఫీతో మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంది.