స్వరాష్ట్ర అవసరాలకే 90% బొగ్గు.. సింగరేణి సంస్థ వెల్లడి
సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 90 శాతం స్వరాష్ట్ర అవసరాల కోసమే సరఫరా చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆగస్టులో 40.51లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే, 36.26 లక్షల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని థర్మల్ప్లాంట్లకే సరఫరా చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 90 శాతం స్వరాష్ట్ర అవసరాల కోసమే సరఫరా చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆగస్టులో 40.51లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే, 36.26 లక్షల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని థర్మల్ప్లాంట్లకే సరఫరా చేసింది. జాతీయంగా విద్యుత్తు వినియోగం పెంపుతో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు కోసం పెద్దఎత్తున వినతులు వస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు సింగరేణి వర్గాలు తెలిపాయి.
మరోవైపు సింగరేణి బొగ్గు కోసం ఇతర రాష్ర్టాల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. పశ్చిమ బెంగాల్‌లోని దామోదర వ్యాలీ కార్పొరేషన్, దుర్గాపూర్‌లోని ఎన్టీఈపీఎల్, ఝజ్జర్‌లోని ఎన్ఎస్పీసీఎల్, తమిళనాడులోని ఎన్‌టీఈసీఎల్ నుంచి బొగ్గు కావాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. 5.2 మిలియన్ టన్నుల బొగ్గు కావాలంటూ వినతులు వస్తున్నాయి. ఒడిశాలోని నైని బొగ్గును సైతం సింగరేణి రాష్ట్ర అవసరాలకే సరఫరా చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

