న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఫోన్ల తయారీలో ఎలాంటి విడి పరికరాలు వాడుతున్నారు, ఏ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు, ఇన్బిల్ట్ యాప్లు వినియోగదారుల నుంచి ఏ సమాచారాన్ని సేకరిస్తాయి, ఎలా పనిచేస్తాయి.. తదితర వివరాలన్నీ తెలుపాలని భారత ప్రభుత్వం చైనా కంపెనీలకు నోటీసులు పంపించినట్టు సమాచారం. చైనా స్మార్ట్ ఫోన్లతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తుతున్న వేళ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది.