జర్మన్ ఓపెన్
న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ టోర్నీలో భారత యువ షట్లర్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-15, 21-16తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై అలవోకగా గెలిచాడు. మరో పోరులో కిడాంబి శ్రీకాంత్ నిరాశపర్చాడు. తొలి రెండు రౌండ్లలో అద్భుత విజయాలతో దూసుకొచ్చిన శ్రీకాంత్ 10-21, 21-23తో టాప్‌సీడ్ విక్టర్ అక్సల్సెన్ (డెన్మార్క్) చేతిలో చిత్తయ్యాడు. 32 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి శ్రీకాంత్‌ను ఇంటిబాట పట్టించిన అక్సెల్సెన్తో లక్ష్యసేన్ ప్రధాన పోటీ ఎదుర్కోనున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం టాప్‌సీడ్ అక్సల్సెన్తో లక్ష్య అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.