దేశంలో 24 గంటల్లో 2.11లక్షల కరోనా కేసులు
దేశంలో 24 గంటల్లో 2.11లక్షల కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరోసారి మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరోసారి మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకుపైగా రికార్డవగా.. తాజాగా నాలుగువేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు వదిలారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 పెరగ్గా.. మొత్తం 2,46,33,951 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,15,235 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 20,26,95,874 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 90.01శాతానికి పెరిగిందని, వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 10.93శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 9.79శాతంగా ఉందని తెలిపింది. వరుసగా మూడు రోజుల్లో రోజువారీ పాజిటివిటీ రేటు పదిశాతాని కన్నా తక్కువగా నమోదైందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 21,57,857 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 33,69,69,352 నమూనాలను టెస్ట్ చేసినట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
మెహుల్ చోక్సీ దొరికాడు..
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
బాదుడే బాదుడు.. 14వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్‌కు బైడెన్ ఆదేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

