ఢిల్లీ: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ ఈవెంట్ అయిన ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌కు మంగళవారం తెరలేవనుంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్లో భారత్ భారీ బృందాన్ని బరిలోకి దింపింది. ఏకంగా 21 మంది షట్లర్లు ఇండియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం భారత బృందాన్ని నడిపించనున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న స్టార్ షట్లర్ సింధు.. పెండ్లి తర్వాత ఆడనున్న తొలి టోర్నీ ఇదే. సింగిల్స్ విభాగాల్లో హెచ్ఎస్ ప్రణయ్, రజావత్, మాళవిక, ఆకర్షి, అనుపమ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి ద్వయానికి తోడుగా మరో ఏడు జంటలు, మిక్స్డ్ డబుల్స్‌లో నాలుగు జోడీలు ఈ టోర్నీ బరిలో నిలిచాయి.