లిమా: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ షాట్‌గన్ టోర్నీలో భారత్‌కు కాంస్యం దక్కింది. పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్ షూటాఫ్‌లో భారత త్రయం కైనాన్ చినాయ్, మానవాదిత్య సింగ్, శపథ్ భరద్వాజ్ 1-0తో బ్రెజిల్‌ను ఓడించి పతకం చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన అసలైన పోరులో ఇరు జట్ల స్కోర్లు 5-5 సమం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన షూటాఫ్ను భారత్ సద్వినియోగం చేసుకుని మూడో స్థానంలో నిలిచింది.