Under -19 World Cup : పురుషుల అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు టైటిల్ పట్టేశారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు ఆరో టైటిల్ కట్టబెట్టారు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసక శతకంతో విరుచుకుపడగా.. బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అంబ్రిష్(3-56) విజృంభించగా100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 174కే ఏడు వికెట్లు పడినా.. టెయిలెండర్ ఫాల్క్‌నర్(115) వీరోచిత సెంచరీ బాదినా సరిపోలేదు. కనిష్క్ ఓవర్లో ఖిలాన్ పటేల్ డైవింగ్ క్యాచ్ అందుకోగా ఆరోసారి అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా.
ఇటీవల రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ ఆసియా కప్, ఆసియా కప్‌లో తేలిపోయిన భారత జట్టు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టింది. అజేయంగా అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా అదిరే ఆటతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ఒడిసిపట్టింది.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
Congratulations to India U19 on winning the ICC Men’s U19 World Cup 2026 👏👏
Their historic 6⃣th title 🫡
Take. A. Bow 🙇
Scorecard ▶️ https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/5a0Pf4wpTw
— BCCI (@BCCI) February 6, 2026
టాస్ గెలిచిన భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) వీరకొట్టుడుకు ఆయుష్ మాత్రే(53), అభిగ్యాన్ కుందు(40) మెరుపులతో 411 పరుగులతో ఇంగ్లండ్‌పై మానసికంగా పైచేయి సాధించింది. కొండంత స్కోర్ కొట్టిన టీమిండియాకు ఛేదనలో ఇంగ్లండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాపార్డర్ విఫలమవ్వగా ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కానీ, టెయిలెండర్లు అసమాన పోరాటంతో భారత బౌలర్లను విసిగించారు. కానీ.. అంబ్రిష్(3-56), కనిష్క్(2-63), దీపేశ్(2-64) అద్బుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు.
India win the men’s Under-19 World Cup by 100 runs! https://t.co/gAZM4NpUfu pic.twitter.com/MyMBZpjIJK
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2026
రికార్డు ఛేదనలో ఇంగ్లండ్‌కు ఐదో ఓవర్లోనే అంబ్రిష్ షాకిచ్చాడు. ఓపెనర్ జోసెఫ్ మూరెస్(17)ను బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. అనంతరం బెన్ మేయ్స్(45) జతగా బెన్ డాకిన్స్(66) బౌండరీలతో చెలరేగాడు. అర్ధ శతకానికి చేరువైన.. బెన్ స్వీప్ షాట్ ఆడిన హెనిల్ పటేల్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయిన డాకిన్స్ను ఆయుష్ మాత్రే బోల్తా కొట్టించాడు. రాల్ఫీ ఆల్బర్ట్(0) క్రీజులోకి రావడమే ఆలస్యం రనౌటయ్యాడు. కవర్స్‌లో ఆడిన బంతిని ఆపిన వైభవ్ మెరుపు వేగంతో వికెట్ కీపర్ కుందు వైపు విసిరాడు. అతడు వికెట్లను గిరాటేయగా..174కే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే దీపేశ్(2-39) ఓవర్లో ఫర్హాన్ అహ్మద్(1) కుందు చేతికి చిక్కాడు. సెబాస్టియన్ మెర్గాన్ సైతం అతడికే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.
మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన భారత బౌలర్లకు ఫాల్క్‌నర్(115), జేమ్స్ మింటో(28) చుక్కలు చూపించారు. ప్రధాన బ్యాటర్లు ఔటైనా వీరు మాత్రం దీటుగా ఆడారు. ఫాల్క్‌నర్ అయితే.. ఎడాపెడా ఫోర్లతో విరుచుకుపడ్డాడు ఎనిమిదో వికెట్‌కు 92 రన్స్ కలిపిన ఈ జోడీని అంబ్రిష్ విడదీసి బ్రేకిచ్చాడు.
సిక్సర్లతో రెచ్చిపోయిన ఫాల్క్‌నర్ సెంచరీ తర్వాత కనిష్క్ ఓవర్లో వెనుదిరిగాడు. ఖిలాన్ పటేల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోగా 311 వద్దఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 100 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
Falconer the lone warrior for England U19🫡
100 off 63 balls. While others struggled, he thrived 🔥#Cricket #U19WorldCup2026 pic.twitter.com/yxYFysvQel
— CREX (@Crex_live) February 6, 2026