న్యూఢిల్లీ: ఫిఫా సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘనంగా ముగించింది. మూడో స్థానం కోసం బుధవారం నైరోబీలో మాలావితో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 3-2తో అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్ తరఫున ఆస్తామ్ ఓరాన్(18ని), అవెకా సింగ్(45ని), ప్రియదర్శిని సెల్లాదురై(84ని) గోల్స్ చేశారు.
మరోవైపు కుమాలో ఇరిన్(42ని), హెన్రీ దెబోరా(60ని) మాలావికి గోల్స్ అందించారు. మ్యాచ్ 18వ నిమిషంలో రైట్ కార్నర్లో నిర్మలాదేవి అందించిన పాస్‌ను ఆస్తామ్ ఓరాన్..మాలావి గోల్కీపర్ను కంగుతినిపిస్తూ భారత్‌కు తొలి గోల్ అందించింది. 21 ఏండ్ల ఓరాన్‌కు భారత్ తరఫును ఇది తొలి గోల్ కావడం విశేషం. అయితే మ్యాచ్ ప్రథమార్థం మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా మూడు నిమిషాల్లో ఇరు జట్లు గోల్స్ చేయడంతో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.