IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IND vs NZ : ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది.
IND vs NZ : ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అర్ధ సెంచరీతో చెలరేగడంతో టీమిండియాకు విజయం దక్కింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు త్వరగా వికెట్లు కోల్పోయింది. 4.4వ ఓవర్లో, 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సంజూ శాంసన్ 14 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చాలా రోజుల తర్వాత టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ నిరాశపరిచాడు. ఆ తర్వాత జట్టు 56 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (27 పరుగులు) ఔటయ్యాడు. దీంతో టీమిండియా 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 పరుగులు మాత్రమే చేసి 4వ వికెట్‌కు వెనుదిరిగాడు.
అప్పటికే బ్యాటింగ్‌లో ఉన్న అక్షర్ పటేల్ కూడా వెంటనే ఔటయ్యాడు. దీంతో 71 పరుగులకే టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులో తిలక్ వర్మ, నమన్ ధీర్ ఉన్నారు. తిలక్ వర్మ నెమ్మదిగా ఆడుతూ వికెట్లు పడకుండా కాపాడాడు. నమన్ ధీర్ మాత్రం తనదైన దూకుడు శైలిలో ఆడుతూ జట్టు స్కోరును పరుగులెత్తించాడు. అయితే, 14.5వ ఓవర్లో, జట్టు స్కోరు 113 ఉన్నప్పుడు నమన్ధీర్ కూడా ఔటయ్యాడు. 31 పరుగులు చేసిన నమన్ ధీర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌కు దిగాడు. ఈ దశలో భారత జట్టు విజయానికి 30 బంతుల్లో 68 పరుగులు అసవరం. ఇప్పుడు క్రీజులో తిలక్ వర్మ, నితీష్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు తెలుగువాళ్లు భారత జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మొదట నితీష్ రెడ్డి దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ కూడా దూకుడు పెంచుతూ లక్ష్య చేధనకు కృషి చేశారు. తిలక్ వర్మ 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్లో భారత జట్టు విజయానికి 11 పరుగులు అవసరం.
అయితే, ఒక బంతి మిగిలి ఉండగానే భారత జట్టు 181 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. తిలక్ వర్మ 26 బంతుల్లో 51 పరుగులు, నితీష్ రెడ్డి 13 బంతుల్లో 26 పరుగులు చేసి, జట్టుకు విజయాన్ని అందించారు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగడంతో క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

