El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
El Nino | పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరాయి. ఎల్‌నినో ప్రభావం (El Nino Effect) పెరుగుతుండటంతో భూమధ్య రేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు తొలిసారి 30 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి.
El Nino : పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరాయి. ఎల్‌నినో ప్రభావం (El Nino Effect) పెరుగుతుండటంతో భూమధ్య రేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు తొలిసారి 30 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వివరాలను వెల్లడించారు.
అక్టోబర్ 22న ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరినట్లు ‘ఇండియా టుడే’ తెలిపింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ఉష్ణమండల ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే సహజ వాతావరణ పరిణామం. దీనివల్ల సముద్రంపై వీచే గాలులు, మేఘాల కదలికలు, వర్షపాత నమూనాల్లో మార్పులు వస్తాయి.
ఈ ప్రభావం పసిఫిక్ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని పలు దేశాల వాతావరణంపైనా పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో కరువు, అధిక ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదల ముప్పు పెరుగుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం.. 2026 అక్టోబర్-డిసెంబర్ మధ్య ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఇది గరిష్ఠస్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో తీవ్రతను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించే నినో 3.4 సూచీలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే.. జూన్‌లో 1.6 డిగ్రీలు, ఆగస్టులో 2.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఈ వ్యత్యాసం 3.7 డిగ్రీలకు చేరవచ్చని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. ఇది గతంలో నమోదైన గరిష్ఠస్థాయి కంటే ఎక్కువ. భారత్‌పైనా ఈ పరిణామాల ప్రభావం ఉండొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2026లో నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో మొత్తం మీద సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే ప్రాంతాలవారీగా పరిస్థితులు మారవచ్చని, ఎల్‌నినో ఒక్కటే భారత వాతావరణాన్ని నిర్ణయించదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

