IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. టేకాఫ్‌కు ముందు ఫైట్ టాయిలెట్లో ఈ బెదరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ విమానం పార్కింగ్ బే వద్దకు తిరిగి చేరుకున్నది.
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. టేకాఫ్‌కు ముందు ఫైట్ టాయిలెట్లో ఈ బెదరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ విమానం పార్కింగ్ బే వద్దకు తిరిగి చేరుకున్నది. (IndiGo flight) ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఇండిగో విమానం 6ఈ 6091, ఢిల్లీ నుంచి చెన్నైకు బయలుదేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆ విమానం వెనుక భాగంలోని టాయిలెట్లో ఒక ‘హెచ్చరిక’ నోట్ లభించింది. ఆ విమానాన్ని చెన్నైకి ప్రయాణం కొనసాగించవద్దని హెచ్చరించినట్లుగా అందులో ఉన్నది.
కాగా, ఈ బెదిరింపు సందేశాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో సంబంధిత నిబంధనల ప్రకారం
విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. దానిని తిరిగి బేకి తీసుకువచ్చారు. అవసరమైన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ) పూర్తి చేశారు. ఆ బెదిరింపు నోట్ బూటకమని తేలింది. ఈ నేపథ్యంలో సుమారు రెండు గంటలు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆ విమానం టేకాఫ్ అయ్యింది. రాత్రి 7.40 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఇండిగో అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

