IND vs NZ : టీమిండియా ఓపెనర్లు శతకాలతో కదం తొక్కారు. నామమాత్రమైన మూడో వన్డేలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన గిల్ మరో సెంచరీతో చెలరేగాడు. గత రెండు మ్యాచుల్లో తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరిన అతను ఈమ్యాచ్‌లో తన బ్యాట్ పవర్ చూపించాడు. 83 బంతుల్లోనే శతకం సాధించాడు. వీళ్లిద్దరూ కివీస్ బౌలర్లపై విరుచుకు పడి ఎడాపెడా బౌండరీలు కొట్టారు. దాంతో, భారత్ స్కోర్ బోర్డు రెండొందలు దాటింది. అంతేకాదు వీళ్లిద్దరూ న్యూజిలాండ్‌పై అత్యధిక రన్స్ (212) చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించారు. దాంతో, 26 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా భారత్ 212 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 400 ప్లస్ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.