IND vs NZ : హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ(51) ఔట్ అయ్యాడు. దాంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. షిప్లే బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. 49 పరుగుల వద్ద రోహిత్ ఎల్బీకోసం కివీస్ రివ్యూ తీసుకుంది. శాంటర్న్ ఓవర్లో బంతి లెగ్ స్టంప్‌కు తగలకపోవడంతో అతను బయటపడ్డాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో అతను కివీస్ బౌలర్లపై తనదైన షాట్లతో విరుచుకపడ్డాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకపడ్డాడు. తొలి వన్డేలో 31 పరుగులతో నిరాశపరిచిన ఇండియా కెప్టెన్ ఈసారి ఏ పొరపాటు చేయలేదు. అతను శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 72 రన్స్ జోడించాడు. ప్రస్తుతం గిల్ (20) , విరాట్ కోహ్లీ (1) ఆడుతున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 72 పరుగులు చేసింది.