IND vs BAN | మొదటి వన్డేలో బంగ్లాదేశ్ విజయం.. మెహిదీ మిరాజ్ సుడిగాలి ఇన్నింగ్స్
ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది
IND vs BAN : ఢాకాలో జరుగుతున్న మొదటి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్, భారత జట్టుపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ మెహిదీ మిరాజ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో బంగ్లాదేశ్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో గెలిచింది. ఒత్తిడిని తట్టుకొంటూ మిరాజ్ 39 బంతుల్లో 38 పరుగుల చేశాడు. అతని ముస్తాఫిజుర్ (10 రన్స్) సహకారం అందించాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన మెహదీ మిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డే 7వ తేదీన జరగనుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ భారత జట్టుపై విజయం సాధించింది. భారత్‌పై బంగ్లాకు ఇది ఆరో వన్డే విక్టరీ.
భారత్ నిర్ధేశించిన 187 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ షాంటో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ లిట్టన్ దాస్ (41 రన్స్) , అనాముల్ హక్ (14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత మిడిలార్డర్లో వచ్చిన షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీం ఆచితూచి ఆడారు. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు వెంట వెంటనే షకిబుల్, ముష్ఫికర్ వికెట్లు తీసి బంగ్లా మీద ఒత్తిడి పెంచారు. అయితే తొమమ్ మహమ్మద్ సిరాజ్‌కు 3 వికెట్లు పడగొట్టాడు. యువ బౌలర్ కుల్దీప్ సేన్ ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. వాషంగ్టన్ సుందర్ 2 వికెట్లు , దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీశారు.
బంగ్గా బౌలర్లు బంతిని స్వింగ్ చేస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ షకిబుల్ ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు తీశాడు. ఆ వెంటనే శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యారు. ఈ దశలో కేఎల్ రాహుల్ 73 పరుగులతో రాణించడంతో భారత్ 186 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ షకిబుల్ 5 వికెట్లు, పేసర్ హెబడాట్ హొసేన్ నాలుగు వికెట్లు తీశారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో షకిబుల్ భారత్‌పై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

