కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి, నవంబర్ 23 : రా ష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయం గా పెరిగిందని స్పష్టం చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహస్వామి, సోమశిల ఆలయాలతోపాటు పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలోని పురాతన మదనగోపాల స్వామి దేవాలయాన్ని మంత్రి కుటుంబ సమేతం గా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మ త్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించేందు కు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని చెరువులు, కుంటలను కూడా స్థానికంగా ఉండే మత్స్యకారులకే అ ప్పగించేలా క్రమ పద్ధతిలో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి మత్స్యకారు ల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే చేపలను విక్రయించేందుకు అర్హత ఉన్న వారికి ద్విచక్ర వాహనాలు, సంఘాలకు పెద్ద వాహనాలను సబ్సిడీపై మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్లలో చేపలు పట్టుకుని ఉపాధి పొందేందుకుగానూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చే స్తున్నట్లు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించారు. యాదవ సం ఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మత్స్యసహకార సంఘం నాయకులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఆయన వెం ట మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కొల్లాపూర్, మాచినేనిపల్లి సింగిల్ విండో చైర్మన్లు పెబ్బేటి కృష్ణయ్య, చింతకుంట శ్రీనివాసులు, వైస్ చైర్మన్ గడ్డం స్వామి, కొల్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, విండో డైరెక్టర్ పరశురాం గౌడ్, జటప్రోల్ సర్పంచ్ ఎస్కే ఖాజా, టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్, కేశవులు, చంద్రశేఖర్‌శెట్టి, ముచ్చర్ల రాంచందర్, సింగోటం నరసింహగౌడ్, మతీన్, సురేందర్‌గౌడ్, రాజేశ్, హన్మంత్, యాదవ సంఘం నాయకులు ఇటిక్యాల సాంబశివుడు యాదవ్, సాయిరాం యాదవ్, ఉరి హరికృష్ణ, గాలియాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.