న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఐసీఐసీఐ బ్యాంక్..క్రెడిట్ కార్డ్ చార్జీలను పెంచింది. అమలులోకి వచ్చిన కొత్త చార్జీల ప్రకారం చెక్కు రిటర్న్‌పై కనీసం రూ.500 ఫీజును లేదా చెక్కు మొత్తంలో 2 శాతం చార్జీగా వసూలు చేస్తారు. అలాగే అనుమతించిన తేదీ తర్వాత రూ.50,000పైగా బకాయి ఉండే మొత్తంపై రూ. 1,200 ఆలస్య రుసుం విధిస్తారు. రూ.100లోపు బకాయి మొత్తానికి మాత్రం చార్జీ ఉండదు. అటుతర్వాత బకాయి మొత్తం పెరిగేకొద్దీ రూ. 100 నుంచి రూ.1,200 వరకూ ఆలస్య రుసుం ఉంటుంది. కొత్త చార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా సంస్థకు చెందిన అన్ని కార్డులకూ ఈ పెంపుదల వర్తిస్తుంది.