విండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలోజనో.. అరంగేట్ర పోరులోనే తీవ్రంగా గాయపడ్డాడు. ఛేజ్ వేసిన ఇన్నింగ్స్ 24వ ఓవర్ నాలుగో బంతికి కరుణరత్నె బలమైన షాట్ ఆడగా.. అది షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సొలోజనో తలను తాకింది. ఆ సమయంలో విండీస్ ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకున్నా.. బంతి వేగం ఎక్కువగా ఉండటంతో ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వైద్యసిబ్బంది అతడిని స్ట్రెచర్లో మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో వైద్య పరీక్షల కోసం దవాఖానాకు పంపినట్లు విండీస్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.