న్యూఢిల్లీ : జోరు వానలో ఓ వ్యక్తి ఆహారం తీసుకుంటున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారు ఎంతటి కఠినాత్ములైనా కంటితడి పెట్టేలా ఉంది. ఓ వ్యక్తి వర్షంలో ఆహారం పాడవకుండా ప్లేట్‌ను స్కూటర్ కింద ఉంచి తినడం కనిపిస్తుంది.
बड़ी शिकायत थी तुझसे ऐ ज़िन्दगी
लेकिन जब ये मंजर देखा तो सारी शिकायत छोड़ दी हमने 💔😢 pic.twitter.com/gJ651OSCJn— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 11, 2022
జిందగి గుల్జార్ హై అనే పేజ్ ట్విట్టర్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ షార్ట్ క్లిప్‌లో వ్యక్తి జోరు వానలో కడుపు నింపుకునేందుకు స్కూటర్ కింద ఉంచిన ప్లేట్ నుంచి ఆహారం తినడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.
ఓ జీవితమా..నీ మీద నాకెన్నో ఫిర్యాదులున్నా ఈ సన్నివేశం చూడగానే వాటన్నింటినీ వదిలేశానని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇవ్వడం అందరినీ కదిలిస్తోంది. ఇది చాలా బాధాకరం..దీన్ని వర్ణించేందుకు మాటల్లేవ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఆకలి ఎంత కిరాతకమైందో అని మరో యూజర్ రాసుకొచ్చారు.