Health Tips | యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఈ ఐదు పానీయాల గురించి మీకు తెలుసా..?
Health Tips | యూరిక్ యాసిడ్ (Uric Acid) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యతో బాధపడే వారు మందులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే ఆహార పదార్థాలతో తయారుచేసే కొన్ని పానీయాలు సహజంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
Health Tips : యూరిక్ యాసిడ్ (Uric Acid) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యతో బాధపడే వారు మందులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే ఆహార పదార్థాలతో తయారుచేసే కొన్ని పానీయాలు సహజంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది మూత్రపిండాల (Kidneys) ద్వారా బయటకు పోతుంది. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కీళ్లలో చిన్న స్ఫటికాలు ఏర్పడి నొప్పి, వాపు కలిగిస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువైతే గౌట్ సమస్య వస్తుంది. కీళ్లలో నొప్పి, వాపు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఆ ఐదు పానీయాలు ఏవో తెలుసుకుందాం..
నీరు : రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచిది. ఇది శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్‌ను పలుచబరచి, మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది.
దోసకాయ జ్యూస్ : దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి, యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే వాపును తగ్గిస్తుంది.
కలబంద జ్యూస్ : కలబంద జ్యూస్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది వాపును తగ్గించి, కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
క్యారెట్ జ్యూస్ : క్యారెట్లలో ఉండే పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, యూరిక్ యాసిడ్ నియంత్రణకు సహాయపడుతుంది.
గ్రీన్ టీ : గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న హానికర పదార్థాలను తగ్గించి, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పానీయాలు సహజంగా సాయపడతాయి కానీ సమస్య ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

