రాత్రి కర్ఫ్యూ విధించండి!
- పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి
- రాష్ర్టాలకు కేంద్రం కీలక సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న పండుగ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. వైరస్ కట్టడికి అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని పేర్కొంది. కనీసం 14 రోజులపాటు ఆంక్షలు కొనసాగేలా చూడాలన్నది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
300కు చేరువగా ఒమిక్రాన్ కేసులు
- దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 300కు చేరువైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు, ఢిల్లీలో 64 కేసులు నమోదయ్యాయి.
- ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో రాత్రి 11-5 గంటల మధ్య కర్ఫ్యూ విధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రకటించింది.
- తమిళనాడులో గురువారం ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. చెన్నైలోనే కొత్తగా 26 కేసులు రికార్డయ్యాయి.
- 5-17 ఏండ్ల చిన్నారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు సురక్షితమేనని అమెరికా ఆహార, ఔషధ సంస్థ తెలిపింది.
- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్స్జేవ్రియా (భారత్‌లో కొవిషీల్డ్) వ్యాక్సిన్ మూడో డోసు ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ పేర్కొంది.
- కాలంతో పాటు వైరస్ నిరవధికంగా శక్తిని పెంచుకోలేదని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేతలు తెలిపారు. అయితే, కరోనా విజృంభణలో ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాకపోవచ్చన్నారు.
- ఒమిక్రాన్ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ గరిష్టస్థాయిని (పీక్ స్టేజీ) దాటిపోయిందని ఆ దేశ పరిశోధకుడు రిద్వాన్ సులేమాన్ తెలిపారు. అమెరికాలో జనవరి-మార్చి మధ్య ఒమిక్రాన్ పీక్ స్టేజీలోకి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

