బ్లాక్‌చైన్ వికేంద్రీకరించిన డిజిటల్ పబ్లిక్ లెడ్జర్. దీన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా కంపెనీ లేదా ప్రభుత్వం నియంత్రించలేదు. సెంట్రల్ బ్యాంకులన్నీ కేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తాయి. ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీ అందుకు పూర్తిగా విరుద్ధం. ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ తన సొంత కాయిన్ డిజిటల్ రుపీని తేనుండటం, అది బ్లాక్‌చైన్ టెక్నాలజీపై నడువనుండటం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పైగా సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ కొత్త డిజిటల్ కరెన్సీ రావడం వల్ల ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకుల మధ్య ఉన్న సంబంధాలూ ప్రభావితం కానున్నాయి. పేపర్ కరెన్సీని చలామణి చేయడానికి, నిల్వ చేయడానికి కమర్షియల్ బ్యాంకులపై సెంట్రల్ బ్యాంకులు ఆధారపడతాయి. ఈ కార్యకలాపాలకు సమయంతోపాటు కొంత ఖర్చూ అవుతున్నది. అయితే డిజిటైజేషన్‌తో ఈ రెండింటికీ అవసరం లేకుండా పోతుంది.