మాగనూరు : నిరుపేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మాగనూరు( Maganur), కృష్ణ( Krishna) మండలాల పరిధిలోరైస్ మిల్లులు, పంట పొలాల మధ్య, రైల్వే ట్రాక్స్ సమీపంలో జోరుగా అక్రమ ఇసుక డంపులు ( Illegal sand dumps ) వెలుస్తున్నాయి. మాగనూర్ మండల కేంద్రం శివారులోని రోడ్డు క్యాంపు దగ్గర ట్రాక్టర్ ద్వారా ఇటీవల కొందరు ఇసుక డంపు చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకున్న ట్రాక్టర్లు ఇసుక డంపు చేసి లారీల ద్వారా హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ రైస్‌మిల్ వద్ద అక్రమ డంపులు ఉన్నాయి.
అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇసుక పక్కదారి పట్టడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు అక్రమార్కులకు సహకరించకుండా, అర్హులైన లబ్ధిదారుల ఇండ్లకు మాత్రమే ఇసుకను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.