ముంబై, ఫిబ్రవరి14: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మ న్ ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టాటా సన్స్ తాజాగా వెల్లడించింది. ఇటీవల ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా సన్స్ గ్రూపు..ఈ సంస్థను గాడిలో పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన ఎయిర్ ఇండియా బోర్డ్..ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 కంటే ముందుగానే ఆయన ఈ పదవిలో చేరనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.