ఆర్మూర్ టౌన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంతో అన్ని అధునాతన సౌ కార్యాలతో వసతి కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మలాలియా, ట్రైనీ కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.