బెంగళూరు, ఏప్రిల్ 8: అజాన్ విషయంలో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని అధికార బీజేపీ గనుక నిర్ణయం తీసుకొంటే.. కర్ణాటకలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ అన్నారు. ముస్లింవర్గాన్ని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండిపడ్డారు.
ముస్లింలు డ్రైవర్లు, ఓనర్లుగా ఉన్న కార్లు, ఇతర వాహనాల్లో హిందువులు ఆలయాలను సందర్శించవద్దని భారతీయ రక్షణ వేదిక పిలుపునిచ్చింది. హిందువులు నడిపే వాహనాల్లోనే ప్రయాణించాలని సూచించింది.