KTR : రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్ల వ్యవహరించిన తీరుపై తాము గవర్నర్కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తమకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్కు, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి 1000 రోజుల అసమర్థ పాలనపై తాము ప్రజల తరఫున ప్రశ్నిస్తే తమపై అరాచకానికి పాల్పడ్డారని విమర్శించారు. తాము ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా తప్పు చేశామా..? అని ప్రశ్నించారు.
ఎన్నికలప్పుడు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులు గడిచినా అమలు చేయని హామీల గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా..? అని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. కాంగ్రెస్ అసమర్థతపై చర్చించేందుకు తాము అసెంబ్లీకి వెళ్లినప్పుడు, పోలీసులు తమను గేటు వద్ద అడ్డుకుని దాడి చేయడమే కాకుండా, తమ మహిళా ఎమ్మెల్యేలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటితో తాము గవర్నర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
తమ ఫిర్యాదుపై చీఫ్ సెక్రెటరీ, డీజీపీతో విచారణ చేయిస్తానని గవర్నర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే, తాము ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్కు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అదేవిధంగా కేసీఆర్ ఇంటిపై దాడి చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ గుండాలకు పోలీసులు ఎర్ర తివాచీ పరిచినట్లుగా వ్యవహరించి, వారిని దగ్గరుండి తీసుకెళ్లిన ఘటనపై కూడా తాము గవర్నర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మేము చేసిన తప్పా?
100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 1000 రోజులైనా చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీయడం మేము చేసిన తప్పా?
దీని మీద చర్చించడానికి అసెంబ్లీకి వెళ్తే పోలీసులు గేట్ దగ్గర ఆపేసి మా మీద దాడి చేశారు, మా మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యకరంగా… https://t.co/t3q1eKvV0S pic.twitter.com/sHJSfxoPYT
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026