తిరుమల : తిరుమలలో ( Tirumala ) ని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరిన భక్తులకు అలిపిరిలో చిరుత ( Leopard ) సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది. బుధవారం మరోసారి భక్తులకు తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది.
అలిపిరి ఏడవ మైలు సమీపంలో చిరుతను చూసి భయాంతోళనకు గురైన భక్తులు టీటీడీ విజిలెన్స్ , అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో హుటాహుటిన విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని నడక భక్తులను గుంపులుగా పంపుతున్నారు. భక్తులు విడిగా వెళ్లవద్దని సూచించారు.