e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Sonusood | సోనుసూద్‌ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Sonusood | సోనుసూద్‌ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ బుధవారం తనిఖీలు చేపట్టింది. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి సోనూసూద్‌ ఇటీవల బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.

సోనుసూద్‌ కొవిడ్‌ మహమ్మారి సమయంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు తరలించి రియల్‌ హీరోగా నిలిచాడు. అయితే, సోనుసూద్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా ఢిల్లీ సీఎంతో భేటీ తర్వాత మరింత ఎక్కువైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐటీశాఖ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana