Keerthy Suresh | మహానటి సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కీర్తిసురేశ్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. సుదీర్ఘ కాలంగా రిలేషన్షిప్లో ఉన్న కీర్తిసురేశ్, ఆంటోనీ థట్టిల్ ఫైనల్‌గా 2024లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. తన కాలేజీ రోజుల్లో లవ్ స్టోరీ గురించి చెబుతూ తాము పెళ్లి చేసుకోవడానికి 15 ఏళ్ల వెయిట్ చేశామంది.
జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది కీర్తిసురేశ్.కీర్తిసురేశ్, ఆంటోనీ రిలేషన్షిప్ 2010లో మొదలైందట. ఈ విషయంపై కీర్తిసురేశ్ మాట్లాడుతూ.. తాను సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందు 2010 ఇద్దరి రిలేషన్షిప్ మొదలుపెట్టినట్టు చెప్పారు. నేను కాలేజీ పూర్తి చేసి నా కెరీర్‌పై ఫోకస్ పెట్టాలనుకున్నా. ఐదారేళ్లు లాంగ్ డిస్టేన్స్ రిలేషన్షిప్లో ఉన్నాం. అతను ఖతార్‌లో ఉంటే.. నేను చెన్నైలో ఉన్నా. అతడు ఇండియా వచ్చిన తర్వాత మేమిద్దరం సెటిల్ అవ్వడానికి టైం కావాల్సి వచ్చింది.
తమ మధ్య మతపరమైన విబేధాల కారణంగా నా కుటుంబం మా ఇద్దరి పెళ్లిని ఒప్పుకోదేమోనని భయపడ్డా. ఇంట్లో మతం సమస్యగా మారొచ్చని అనుకున్నాం. నాలుగేళ్ల క్రితం నాన్నతో ఆంటోని గురించి మాట్లాడాను. ఆయన చాలా తేలికగా పని అయిపోయేలా చేశారు. నేను ఊహించనంతగా అసలేం జరుగలేదంది కీర్తిసురేశ్.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.