హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ), రియల్ కశ్మీర్ జట్ల మధ్య గురువారం జరిగిన పోరు 1-1తో డ్రాగా ముగిసింది. శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా(42ని) గోల్ చేయగా, కశ్మీర్‌కు పౌలో సెజార్(25ని) ఏకైక గోల్ అందించాడు. లీగ్‌లో శ్రీనిధి ప్రస్తుతం 16 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నది.