Hyundai sales : కార్ల అమ్మకాల్లో ‘హ్యుందాయ్ ఇండియా లిమిటెడ్ (Hyundai Motor India Limited – HMIL)’ రికార్డు సృష్టించింది. 2024 క్యాలెండర్ ఇయర్లో దేశీయంగా మొత్తం 6,05,433 యూనిట్లు అమ్ముడుపోయాయి. దేశీయంగా, విదేశాల్లో కలిపి 7,64,119 కార్లు సేల్ అయ్యాయి. కేవలం డిసెంబర్ నెలలోనే మొత్తం 55,078 హ్యుందాయ్ కార్లు అమ్ముడయ్యాయి. అందులో దేశీయంగా అమ్ముడైన యూనిట్లు 42,208 కాగా, విదేశాలకు ఎగుమతి అయిన యూనిట్లు 12,870 ఉన్నాయి.
2024లో హ్యుందాయ్ కార్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు. దేశీయంగా కార్ల అమ్మకాల్లో గడిచిన మూడేళ్లలో ఈ ఏడాది అత్యధికంగా కార్లు అమ్ముడుపోయాయని గార్గ్ చెప్పారు. హ్యుందాయ్ కార్లలో అత్యధికంగా క్రెటా మోడల్ కార్లు అమ్ముడయ్యాయని తెలిపారు. దేశీయంగా 1,86,919 క్రెటా కార్లు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు.
గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది సీఎన్జీ కార్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయని తరుణ్ గార్గ్ చెప్పారు. 2024 క్యాలెండర్ ఇయర్లో మొత్తం కార్ల అమ్మకాల్లో సీఎన్జీ కార్ల శాతం 10.4 శాతం కాగా.. ఈ ఏడాది అది 13.1 శాతానికి పెరిగిందని తెలిపారు.