పెబ్బేరు/శ్రీరంగాపురం, మార్చి 4 : చెంతనే కృ ష్ణమ్మ పారుతున్నా.. సాగునీరు లేక నెర్రెలు బారిన చెరువులు నేడు ప్రత్యేక రాష్ట్రంలో జలసవ్వడి సంతరించుకున్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు తెలిపారు. ఈ నెల 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ బ హిరంగసభ సందర్భంగా శుక్రవారం పెబ్బేరు, శ్రీ రంగాపురం మండలస్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల తో ఆయా మండలకేంద్రాల్లో సన్నాహక సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రాము లు మాట్లాడుతూబహిరంగ సభకు నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని పి లుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిని మరుగున పడేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. సా గునీరు లేక నాడు వలసలు వెళ్లిన వారు నేడు సొం త గ్రామాలకు వచ్చి సంబురంగా సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమంలో ప్రజలను భాగస్వాములు చే యాలన్నారు. బహిరంగ సభకు ప్రతి గ్రామం నుం చి వెయ్యి మందికిపైగా ప్రజలను తరలించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆయా సమావేశాల్లో పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణ శ్రీ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్యామల, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్, వైస్ చైర్మన్ బుచ్చారెడ్డి, విశ్వరూపం, సింగిల్ విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, ఎల్లారెడ్డి, డైరెక్టర్లు భారతి, బలరాంనాయడు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రాములు, దిలీప్‌రెడ్డి, శ్రీరంగాపురం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామి, రైతుబంధు సమితి అధ్యక్షుడు గౌడ్‌నాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు, సర్పంచులు వినీలారాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకుడు పృథ్వీరాజ్ తదితరులున్నారు.