గౌతంనగర్, నవంబర్ 18: టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే తాగు సాగునీటి సమస్యలు లేకుండా పోయ్యాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధి ‘హిల్‌టాప్’ బస్తీలో రూ.15 లక్షల నిధులతో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్‌లు కలిసి వాటర్ పైపులైన్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లను అందించి కుటుంబానికి సరిపడేంత తాగునీటిని అందించారన్నారు.
ఉచితంగా వాటర్‌ను అందించే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంమని, స్లమ్ ఏరియాలో వాటర్ బిల్లులను మాఫీ చేశామని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నీటి బాధలు తీరాయని, గతంలో నీటి కష్టాలు ఉండేవని ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీళ్లును అందించి మహిళాలు పడే ఇబ్బందులను తొలగించామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లను అందించామని తెలిపారు. హిల్‌టాప్, ఇందిరానెహ్రూనగర్, రామాంజనేయనగర్, వెంకటేశ్వరనగర్ తదితర ఎతైన ప్రాంతాలలో బూస్టార్లు, వాల్ బిగించి నీటి సరఫరా చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్‌పురి జలమండలి జీఎం సునీల్‌కుమార్, మారేడ్‌పల్లి జీఎం రమణరెడ్డి, డీజీఎం కృష్ణ, స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హిల్‌టాప్ బస్తీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.