Avanthi Srinivas | రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని ఆంధ్రప్రదేశ్ నాయకులన్నారు, కానీ అది ఉల్టా అయిందని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) అన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని చెప్పారు. హైదరాబాద్ అంత డెవలప్ కావడానికి కారణం అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉన్నందుకేనని తెలిపారు. గురువారం ఉదయం వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిపై కామెంట్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి పంపానన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వైఎస్ జగన్కు అవంతి శ్రీనివాస్ సూచించారు.
ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి
గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది
రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు కానీ ఉల్టా అయ్యింది
హైదరాబాద్ అంత డెవలప్ ఎందుకు అయిందంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి – ఏపీ మాజీ మంత్రి… https://t.co/kL8M5pYmg5 pic.twitter.com/VemT6bWf6E
— Telugu Scribe (@TeluguScribe) December 12, 2024