గోల్నాక, నవంబర్ 12: ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) జీవిత చరిత్రపై నిషేధిత పుస్తకాలు ముద్రిస్తున్న ఓ ప్రిం టింగ్ ప్రెస్పై పోలీసులు దాడి చేశారు. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి దుర్గానగర్‌లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాలు ముద్రిస్తున్నారన్న సమాచారంతో అడిషనల్ డీసీపీ మురళీధర్‌రావు నేతృత్వంలో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అక్కడ వెయ్యి నిషేధిత మావోయిస్టు సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజయాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. ఆర్కే భార్య శిరీష ఆదేశాలతో పుస్తకాలు ముద్రించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కొంతకాలంగా మావోయిస్టు అనుబంధ సంస్థలకు రామకృష్ణారెడ్డి సహకరిస్తున్నట్టు సమాచారం.